: బుల్లితెర నటుడు ప్రదీప్ అరెస్టు, రిమాండ్, విడుదల...అన్నీ ఒక్కరోజే!


బుల్లితెర నటుడు ప్రదీప్ అరెస్టై చంచల్ గూడ జైలుకి రిమాండ్ ఖైదీగా వెళ్లడం, బెయిల్ పై విడుదలవ్వడం సినిమా తరహాలో ఒకే రోజు చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే... చెక్‌ బౌన్స్‌ కేసులో బుల్లి తెర నటుడు ప్రదీప్‌ నిందితుడిగా ఉన్నాడు. దీంతో అతనిని అరెస్టు చేసిన పంజాగుట్ట పోలీసులు ఎర్రమంజిల్ న్యాయస్థానంలో హాజరుపరిచారు. దీంతో అతనికి న్యాయస్థానం రిమాండ్ విధించింది. దీంతో కోర్టు ఆదేశాల మేరకు అతనిని చంచల్ గూడ జైలుకి తరలించారు. అనంతరం కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో గంటల వ్యవధిలోనే విడుదలయ్యాడు. 

  • Loading...

More Telugu News