: యాపిల్ షూస్ @ 19.25 లక్షలు!
యాపిల్ బ్రాండ్ కు ఉన్న ఇమేజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. సాంకేతిక పరిజ్ఞానంతో వస్తువులు తయారు చేసి మార్కెట్ లో విక్రయించడంలో విశేషమైన పేరు గడించిన యాపిల్ బ్రాండ్ నుంచి స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లు, స్మార్ట్ వాచ్ లు, ఇతర ఉపకరణాలు కూడా మార్కెట్ లోకి వచ్చాయి. అయితే ఈ సంస్థ 1990లో ఉద్యోగుల కోసం ఆదిదాస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, షూస్ తయారు చేయించింది. అందులో కేవలం రెండు జతలు మాత్రమే మిగిలి ఉండడంతో...ఒక జతను 'ఈబే'లో వేలానికి పెట్టారు. ఈ వేలంలో ఆ షూ ధర 19.29 లక్షలు పలుకుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.