: ఎమర్జెన్సీ లైట్‌లో బంగారం దాచి, త‌ర‌లించ‌బోయారు.. బుక్క‌య్యారు!


అక్ర‌మంగా బంగారాన్ని త‌ర‌లించి, సొమ్ము చేసుకోవడానికి కొత్త కొత్త మార్గాల‌ను అన్వేషిస్తున్నారు. అలాగే ఈ రోజు ఉత్తరప్రదేశ్, లక్నోలోని ఇంట‌ర్నేష‌న‌ల్ ఎయిర్‌పోర్టులో ఇద్ద‌రు వ్య‌క్తులు ఎమర్జెన్సీ లైట్‌లో బంగారాన్ని ఉంచి త‌నిఖీ అధికారుల క‌ళ్లు క‌ప్పి తీసుకెళ్లాల‌నుకున్నారు. అయితే, వారి క‌న్నా తెలివైన అధికారులు వారి క‌దలిక‌ల‌పై అనుమానం వ‌చ్చి వారితో ఉన్న ఎమ‌ర్జెన్సీ లైటు స‌హా ఓ స్పీక‌ర్‌ను క్షుణ్ణంగా ప‌రిశీలించారు. వాటిల్లో 18 బంగారు బిస్కెట్లు బయటపడ్డాయి. వాటిని స్వాధీనం చేసుకున్న అధికారులు, వాటి విలువ రూ.63 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసులో ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది.            

  • Loading...

More Telugu News