: ఆకలితో అలమటిస్తూ తిండి కోసం క్యూలో నిలుచున్న ట్రంప్, ఒబామా, కిమ్ జాంగ్ ఉన్, పుతిన్..!: ఆకట్టుకుంటున్న సృజన!


చేతిలో బొచ్చె పట్టుకుని క్యూలో నిలబడాల్సిన అవసరం మహామహులైన బరాక్ ఒబామా, కిమ్ జాంగ్ ఉన్, వ్లాదిమిర్ పుతిన్, డొనాల్డ్ ట్రంప్, డేవిడ్ కామెరాన్, జీ జిన్ పింగ్, ఏంజెలా మోర్కెల్ లకు ఏమొచ్చింది? అన్న అనుమానం వచ్చిందా? అవును... వారంతా చేతిలో బొచ్చెతో ఆహారం కోసం ఎదురుచూస్తూ క్యూలో నిలబడ్డారు. అయితే, ఇది నిజజీవితంలో కాదు. అబ్దుల్లా అల్‌ ఒమర్‌ అనే శరణార్థి తన సృజనాత్మకతకు పదును పెట్టి 19 నెలలపాటు కష్టపడి కళాఖండాలు గీశాడు. వీటిని దుబాయ్ లోని ఆర్ట్ గ్యాలరీలో ఉంచాడు.

శరణార్థుల బాధలు ప్రపంచానికి చాటిచెప్పేందుకు మీడియా, సోషల్ మీడియాలను తలదన్నేలా చేయాలని భావించిన అబ్దుల్లా అల్ ఒమర్ ఇలా వివిధ ప్రస్తుత, మాజీ దేశాధినేతల ఫోటోలను శరణార్థులుగా చిత్రీకరించాడు. ఈ ఫోటోలు ఇప్పుడు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. అంతకంటే ఎక్కువగా శరణార్థుల సమస్యలను ప్రపంచానికి చాటుతున్నాయి. పిల్లాడిని భుజంపై ఉంచుకున్న ట్రంప్... లగేజీని మోస్తున్న ఫోటో అందర్నీ ఆకట్టుకుంటోంది. బిచ్చగాళ్ల వలే ఆహారం కోసం క్యూలో నిల్చున్న దేశాధ్యక్షుల ఫోటో కూడా అందర్నీ ఆకర్షిస్తోంది.

  • Loading...

More Telugu News