: తొలి వికెట్ తీసిన బంగ్లాదేశ్... కివీస్ 46/1


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా కార్డిఫ్ లో న్యూజిలాండ్, బంగ్లాదేశ్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు గుప్టిల్ (30), ల్యూక్ రోంచి (16) న్యూజిలాండ్ జట్టుకు శుభారంభం ఇచ్చారు. 8వ ఓవర్ తొలి బంతికి టస్కిన్ అహ్మద్ రోంచీని పెవిలియన్ కు పంపాడు. దీంతో నిలకడగా ఆడుతున్న భాగస్వామ్యం విడిపోయింది. అప్పటికి న్యూజిలాండ్ 46 పరుగులు చేసింది. అనంతరం గుప్టిల్ కు విలియమ్సన్ జతకలిశాడు. బంగ్లా బౌలర్లు గుడ్ లెంగ్త్ బంతులతో ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. 

  • Loading...

More Telugu News