: థ్యాంక్యూ రానా బాబాయ్: హీరో నాని
‘ఈ అమ్మాయిలు కూడా అస్సలు అర్థం కారు బాసూ.. అన్ని అలవాట్లూ ఉన్నవాడిని ప్రేమిస్తారు.. ఏ అలవాట్లూ లేని వాడిని పెళ్లి చేసుకుంటారు’ అంటూ తన కొత్త సినిమా ‘నిన్ను కోరి’లో నేచురల్ స్టార్ నాని చెప్పిన డైలాగ్ అలరిస్తోంది. నిన్న ఈ సినిమా టీజర్‌ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ టీజర్‌ను చూసిన నటుడు దగ్గుబాటి రానా ఈ టీజర్ ఎంతో బాగుందని, ఈ సినిమా యూనిట్‌కి బెస్ట్ విషెస్ చెబుతున్నానని తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నాడు.
రానా ట్వీట్ ను చూసిన నాని మురిసిపోయాడు. ‘థ్యాంక్యూ బాబాయ్’ అని కామెంట్ చేసి హర్షం వ్యక్తం చేశాడు. నిన్న రాత్రి విడుదలైన ఈ టీజర్ కి అప్పుడే నాలుగున్నర లక్షల క్లిక్స్ వచ్చేశాయి. డివివి ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు.