: కోహ్లీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కేఆర్కే!


ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంక చేతిలో టీమిండియా ఓటమిపాలు కావడంపై బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్  (కేఆర్కే) మండిపడ్డారు. కోహ్లీపై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డాడు. ఓ మోసగాడు, వాంటెడ్ క్రిమినల్ అయిన విజయ్ మాల్యాతో పార్టీలు చేసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుందని ఎద్దేవా చేశాడు. ఛాంపియన్స్ ట్రోఫీని ఇండియా గెలవలేదనే విషయం ఈ ఓటమితో తేలిపోయిందని అన్నాడు. సెమీస్ లో కాని, ఫైనల్స్ లో కాని టీమిండియా ఓడిపోవడం ఖాయమని చెప్పాడు. కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తన జీవితంలో ఒక్క ట్రోఫీని కూడా గెలవలేడని అన్నాడు. ఎందుకంటే, కోహ్లీ ఆడేది తక్కువ, ఎగిరేది ఎక్కువని... ఆలోచన తక్కువ, తిట్లు ఎక్కువని ఎద్దేవా చేశాడు. 

  • Loading...

More Telugu News