: హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం
జూన్ ప్రారంభంలోనే వానలు దంచికొడుతున్నాయి. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మేడ్చల్, మల్కాజిగిరి, నారాయణ గూడ, మలక్ పేట్, దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, రామాంతపూర్, షేక్ పేట్, టోలిచౌకి, సైదాబాద్, మాదాపూర్, యూసఫ్‌గూడ, మోతీ నగర్, బోయిన్ పల్లి, సుచిత్ర, జీడిమెట్లతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం పడుతోంది. పలుచోట్ల రోడ్లపైనే నీరు నిలిచిపోవడంతో వాహనాలు నత్తనడకన ముందుకు కదులుతున్నాయి.