: పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతి పట్ల మోదీ సంతాపం
రాజ్యసభ సభ్యుడు, తెలంగాణ ఉద్యమ నేత పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు పీఎంవో ట్విట్టర్ ఖాతాలో ప్రధాని మోదీ పేరిట ఓ ట్వీట్ చేశారు. పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నట్లు అందులో మోదీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గతంలో పాల్వాయి ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు.
Saddened by the demise of Rajya Sabha MP Shri Palvai Govardhan Reddy. My thoughts and prayers are with his family and supporters: PM
— PMO India (@PMOIndia) 9 June 2017