: ఎట్టకేలకు రాణీ ముఖర్జీ ముద్దుల కూతురు కెమెరాకు చిక్కింది!
ప్రముఖ బాలీవుడ్ నటి రాణిముఖర్జీ, ఆదిత్యా చోప్రాల చిన్నారి అదిరా చోప్రా ఎలా ఉంటుందో ఇంతవరకూ అభిమానులకు తెలియదు. ఈ చిన్నారిని ఫొటో గ్రాఫర్ల కంట పడకుండా రాణి ముఖర్జీ ఎంతో జాగ్రత్త పడింది. కానీ, ముంబై ఎయిర్ పోర్టులో తన కూతురిని ఎత్తుకున్న రాణిముఖర్జీ ఫొటో గ్రాఫర్లకు దొరికిపోయింది. ఓ ఆంగ్ల పత్రిక ఇందుకు సంబంధించిన ఫొటోను ప్రచురించింది. ఈ ఫొటోలో రాణి ముఖర్జీ బ్లూ జంప్ సూట్ లో ఉండగా, అదిరా మాత్రం పింక్ డ్రెస్సు ధరించి, రెండు చిన్న జడలు వేసుకుని ఉంది.