: విశాఖ హోటల్ లో దారుణం: ఉద్యోగినిపై సిబ్బంది అత్యాచారం
విశాఖపట్టణంలోని ఓ ప్రముఖ హోటల్ లో పనిచేస్తున్న ఓ యువతిపై సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు వ్యక్తులు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు ఆ ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.