: ఎలాగైనా సరే, బౌలర్లు గెలిపిస్తారని భావించా: కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకపై భారత్ పరాజయం పొందడంపై టీమిండియా కెప్టెన్ కోహ్లీ స్పందించాడు. తమ బౌలర్లను ఎంతగానో నమ్మానని, గెలిపిస్తారని భావించానని, కానీ, అలా జరగలేదని అన్నాడు. పాక్ పై రాణించిన బౌలర్లు ఈ మ్యాచ్ లో అంతగా రాణించలేదని, శ్రీలంక బ్యాటింగ్ బాగుండటమే అందుకు కారణమని అనుకుంటున్నట్టు చెప్పాడు. కుషాల్ మెండిస్, ధనుష్క గుణతిలక లు తమ నుంచి మ్యాచ్ ను దూరం చేశారని, టీమిండియా బౌలర్లు తమ ఆలోచనలకు మరింత పదును పెడితే బాగుండేదని అన్నాడు. 322 పరుగులంటే సాధారణ లక్ష్యమేమి కాదని, శ్రీలంక బ్యాటింగ్ అద్భుతంగా ఉందని కోహ్లీ కితాబిచ్చాడు.