: మరోమారు బయటపడిన పాక్ కుట్ర.. ఉగ్రవాదుల ఆయుధాలపై ‘మేడిన్ పాకిస్థాన్’ గుర్తులు!
పాకిస్థాన్ కుట్ర మరోమారు బయటపడింది. నౌగమ్ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన ముగ్గురు ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న ఆయుధాలు, మందుగుండు, ఆహారం, మందులపై ‘మేడిన్ పాకిస్థాన్’ గుర్తులు ఉన్నట్టు ఇండియన్ ఆర్మీ తెలిపింది. గురువారం ఉరి సెక్టార్‌లోని నియంత్రణ రేఖ నుంచి భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. భారత ఆర్మీ వారి ఆటలు కట్టించింది. కుప్వారా జిల్లాలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. వారి నుంచి ఆర్మీ అధికారులు పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రి, మందులు, ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకుంది. అవన్నీ పాకిస్థాన్‌లోనే తయారైనట్టు వాటిపై ముద్రించి ఉండడం పాక్ ఉగ్రదాహాన్ని మరోమారు బహిర్గతం చేసింది. కాగా, ఎన్‌కౌంటర్‌లో ఓ జవాను అమరుడు కాగా మరో ఇద్దరు గాయపడ్డారు.