: దాసరి కుటుంబ సభ్యులను పరామర్శించిన వెంకయ్యనాయుడు
అనారోగ్యం కారణంగా ఇటీవల మృతి చెందిన దర్శకుడు దాసరి నారాయణరావు కుటుంబసభ్యులను కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఈరోజు పరామర్శించారు. అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, దాసరి నారాయణరావు అందరి గురించి ఆలోచించే వ్యక్తి అని, దాసరి మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలుపుతున్నానని చెప్పారు. కాగా, గత నెల 30న దర్శకుడు దాసరి మృతి చెందారు.