: జియో ఫైబర్ ఎఫెక్ట్.. టారిఫ్ రేట్లను భారీగా తగ్గించేందుకు సిద్ధమైన బీఎస్ఎన్ఎల్!


రిలయన్స్ జియో ఫైబర్ టు ది హోం (ఎఫ్‌టీటీహెచ్) సర్వీసులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వ రంగ సంస్థ బీఎఎస్ఎన్ఎల్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా హోం బ్రాడ్‌బ్యాండ్ టారిఫ్ రేట్లను భారీగా తగ్గించేందుకు  సిద్ధమైంది. ప్రస్తుతం ఉన్న ప్లాన్లను మరోసారి సమీక్షిస్తామని, జియో టారిఫ్ ప్లాన్లతో సరిపోయలా చూస్తామని బీఎస్ఎన్ఎల్ చైర్మన్ అనుపమ్ శ్రీవాస్తవ తెలిపారు.

ట్రాయ్ లెక్కల ప్రకారం ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ వైర్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసులో కోటిమంది వినియోగదారులున్నారు.  భారతీ ఎయిర్‌టెల్‌కు 1.95 మిలియన్ల మంది కస్టమర్లున్నారు. కాగా, అతి త్వరలో జియో ఫైబర్ సేవలు ప్రారంభం కానున్నాయి. ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా మూడు నెలల పాటు ఉచిత సేవలు అందించేందుకు జియో సిద్ధమవుతోంది. ఆ తర్వాత నెలకు రూ.500తో 100జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. జియో 4 జీ మొబైల్ సర్వీసుల్లానే ఇది కూడా సంచలనం సృష్టించే అవకాశం ఉండడంతో బీఎస్ఎన్ఎల్ ఇప్పటి నుంచే నష్టనివారణ చర్యలు ప్రారంభించింది.

  • Loading...

More Telugu News