: అప్పట్లో బాబాయ్ వెంకటేష్.. ఇప్పుడు నేను!: రానా షేర్ చేసిన ఫొటో
బాహుబలి, ఘాజీ లాంటి సినిమాలతో అదరగొట్టిన యంగ్ హీరో రానా ప్రస్తుతం ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్‌ను ఇటీవలే విడుదల చేయగా అది యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. రానా లుంగీ కట్టు, బారెడు గడ్డంతో కొత్త లుక్‌లో కనిపిస్తున్న తీరు అభిమానులను అలరిస్తోంది.
ఇదిలా ఉంచితే, దాదాపు 20 ఏళ్ల క్రితం రానా బాబాయ్ విక్టరీ వెంకటేష్ కూడా అచ్చం ఇటువంటి లుక్‌లోనే ఓ సినిమాలో కనిపించి అలరించాడు. అప్పట్లో బాబాయ్ ఆ లుక్‌లో కనిపించిన ఫొటోను, ఇప్పుడు తాను కూడా అటువంటి లుక్‌లోనే కనిపిస్తోన్న ఫొటోను కలిపి ఉన్న ఓ ఫొటోను రానా తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దానిపై అప్పట్లో బాబాయ్.. ఇప్పుడు అబ్బాయ్ అని పేర్కొన్నారు. ఈ ఫొటోలు, క్యాప్షన్ దగ్గుబాటి అభిమానులను అలరిస్తున్నాయి. నేనే రాజు నేనే మంత్రి సినిమా తేజ దర్శకత్వంలో పొలిటికల్ థ్రిల్లర్ గా రూపుదిద్దుకుంటోంది. కాజల్ అగర్వాల్ ఇందులో హీరోయిన్ నటిస్తోంది.
The fever continues.. #NeneRajuNeneMantri
— Suresh Productions (@SureshProdns) June 8, 2017
Enjoy the teaser here: https://t.co/yu0p5DM7u0 pic.twitter.com/MgUV0yls0y
The best