: హైదరాబాద్‌లో హోటళ్లపై పోలీసుల దాడులు.. ఓ హోటల్‌పై కేసు నమోదు
హైదరాబాద్‌లో నిబంధనలు పాటించకుండా నడిపిస్తున్న హోటళ్లపై జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు కన్నెర్ర చేస్తున్నారు. ఈ రోజు నగరంలోని కొత్తపేటలో పలు హోటళ్లపై పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించి, ఆహార పదార్థాలను క్షుణ్ణంగా పరిశీలించారు. నాణ్యత లేని ఆహార పదార్థాలను అందిస్తున్న కొత్తపేటలోని జాయ్‌ఫుడ్ సెంటర్ నుంచి 3 క్వింటాళ్ల బియ్యం, 2 కిలోల చికెన్, 100 లీటర్ల సాస్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జాయ్‌ఫుడ్ హోటల్ పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే ఏ మాత్రం ఉపేక్షించబోమని హెచ్చరించారు. హోటళ్లపై పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది.