: 125 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శిఖర్ ధావన్ అవుట్!
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా లండన్‌లోని ఓవల్‌లో ఈ రోజు జరుగుతున్న టీమిండియా, శ్రీలంక మ్యాచ్‌లో ధాటిగా ఆడుతున్న భారత ఓపెనర్ శిఖర్ ధావన్ 125 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మలింగ బౌలింగ్‌లో అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి పాండ్యా వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు నాలుగు వికెట్ల నష్టానికి 261పరుగులు (44.1ఓవర్లకి)గా ఉంది. టీమిండియా ఆటగాళ్లలో రోహిత్ శర్మ 78, కోహ్లీ 0, యువరాజ్ 7 పరుగులు చేశారు. శ్రీలంక బౌలర్లలో మలింగకి రెండు, ప్రదీప్, అసేలాలకు చెరో వికెట్ దక్కాయి. క్రీజులో నిలదొక్కుకున్న ధోనీ 40 పరుగులతో ఆడుతున్నాడు.