: అందాల నటి బ్రిట్నీ స్పియర్స్ ఇన్ స్టాగ్రామ్ ఫాలో అయితే.. ఇక అంతే సంగతులు!
హాలీవుడ్ అందాల భామ, సింగర్ బ్రిట్నీ స్పియర్స్ ఇన్ స్టాగ్రామ్ ను ఎంతో మంది అభిమానులు ఫాలో అవుతుంటారు. అయితే, ఆమె ఇన్ స్టాగ్రామ్ లో వైరస్ లింకులు తిష్ట వేశాయట. ఈ విషయాన్ని ఈఎస్ఈటీ పరిశోధకులు గుర్తించారు. మాల్ వేర్ లింకులను ఫాలోయర్లు రాసే కామెంట్ల మధ్య గుట్టుచప్పుడు కాకుండా హ్యాకర్లు చొప్పించారని వారు తెలిపారు. ఎవరైనా యూజర్లు పొరపాటున ఈ లింకులను క్లిక్ చేస్తే... అది నేరుగా మాల్ వేర్ సర్వర్లకు కనెక్ట్ అవుతుందట. ఈ మాల్ వేర్ ఒక్కసారి మన కంప్యూటర్ లోకి వస్తే... మొత్తం బ్రౌజింగ్ హిస్టరీని లాగేస్తుందట. ప్రస్తుతం బ్రిట్నీకి కోటీ 69 లక్షల మంది ఫాలోయర్లు ఉన్నారు.