: లక్ష ఎకరాల భూమి కబ్జా అయిందని కలెక్టరే చెప్పారు.. సీబీఐ విచారణ జరపాల్సిందే: విజయసాయి రెడ్డి
విశాఖలో లక్ష ఎకరాల భూమి కబ్జా అయినట్టు స్వయంగా జిల్లా కలెక్టరే చెప్పారని వైసీపీ నేత విజయసాయి రెడ్డి అన్నారు. ఈ భూ కబ్జాలపై సీబీఐ విచారణ జరపాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ భూ కబ్జాలపై నేడు వివిధ పార్టీల రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, భూ కబ్జాలతో అధికార పార్టీ నేతలకు, మంత్రులకు కూడా సంబంధం ఉందని ఆరోపించారు. 14న కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను, ఆ తర్వాత రాష్ట్రపతిని కలసి భూ కబ్జాలపై వివరిస్తామని చెప్పారు. 15వ తేదీన కలెక్టరేట్ లో పబ్లిక్ హియరింగ్ లో ప్రజావాణిని వినిపిస్తామని తెలిపారు. భాధితులకు వైసీపీ ఎల్లవేళలా అండగా ఉంటుందని చెప్పారు.