: వైయస్ కుటుంబంపై విమర్శలు గుప్పించిన బీటెక్ రవి!


గత 38 ఏళ్లుగా పులివెందులకు వైయస్ కుటుంబం ఏమి చేసిందని టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవి ప్రశ్నించారు. వారి కుటుంబీకులు ముఖ్యమంత్రి దగ్గర నుంచి సర్పంచ్ స్థాయి వరకు పలు పదవులను చేపట్టినా... చేసిందేమీ లేదని అన్నారు. పులివెందుల ప్రాంతంలో వైయస్ కుటుంబం మాత్రమే బాగుపడిందని... జనాల బతుకుల్లో మాత్రం ఎలాంటి మార్పు రాలేదని చెప్పారు. యర్రబల్లె చెరువుకు నీరు తెప్పించాల్సి ఉండగా... వారి బంధువుల మైనింగ్ కు ఇబ్బంది కలుగుతుందనే కారణంతో నీరు తెప్పించలేదని విమర్శించారు. అరటి వ్యాపారులతో కుమ్మక్కై... లారీ అరటికి రూ. 5 వేలు వసూలు చేస్తున్నారని చెప్పారు. పులివెందుల ప్రజల సంక్షేమం కోసం తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో చేస్తోందని రవి తెలిపారు.

  • Loading...

More Telugu News