: కశ్మీర్లో రాళ్లు రువ్విన దుండగులు.. పల్టీ కొట్టిన ఆర్మీ వాహనం!


ఆర్మీ వాహనం పల్టీ కొట్టిన ఘటనలో 12 మంది జవాన్లు గాయపడ్డారు. ఈ ఘటన జమ్ముకశ్మీర్ లోని సోఫియాన్ లో నిన్న సాయంత్రం చోటు చేసుకుంది. జవాన్లతో వెళుతున్న సమయంలో వాహనంపైకి ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. ఈ నేపథ్యంలో, డ్రైవర్ అదుపుతప్పాడు. దీంతో, వాహనం పల్టీ కొట్టింది. ఈ ఘటనలో 12 మంది జవాన్లకు గాయాలయ్యాయి. అనంతరం వీరందరినీ చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

మరోవైపు, నౌగమ్ సెక్టార్లో నేడు ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు సరిహద్దులు దాటి భారత్ లోకి చొరబడేందుకు యత్నిస్తుండగా భారత భద్రతాదళాలు వారిపై కాల్పులు జరిపాయి. ఈ ఎన్ కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోగా, ఒక జవాను కూడా ప్రాణాలు వదిలాడు.   

  • Loading...

More Telugu News