: యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు చేదు అనుభవం!


పలు కీలక నిర్ణయాలతో పాలనలో దూసుకుపోతున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. లక్నో యూనివర్శిటీ ఎదుట యోగి కాన్వాయ్ ను చుట్టుముట్టిన పలువురు విద్యార్థులు... ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. యోగి హయాంలో దళితులు, ముస్లింలపై హింస పెరిగిపోయిందని వారు ఈ సందర్భంగా ఆందోళన చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా విద్యార్థులు పడుకోవడంతో, యోగి కాన్వాయ్ కాసేపు ఆగిపోయింది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నిరసన కార్యక్రమంలో సమాజ్ వాదీ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్ కు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు.

ఈ ఆందోళన నేపథ్యంలో ఒక సబ్ ఇన్స్ పెక్టర్, ఆరుగురు కానిస్టేబుళ్లను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. 14 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు. వీరిలో నలుగురు విద్యార్థినులు ఉండటం గమనార్హం. 

  • Loading...

More Telugu News