: కోహ్లీని తమకు ఇచ్చేయమన్న పాక్ జర్నలిస్టు.. భారతీయుల సెటైర్లు!


ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పై ఓడడాన్ని పాకిస్థానీలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ జర్నలిస్టు నజరానా గఫర్ ట్వీట్ చేస్తూ... టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్కడిని మాకు ఇచ్చేయండి...అందుకు ప్రతిగా మొత్తం పాకిస్థాన్ జట్టునే తీసుకోండి అంటూ సరికొత్త ప్రతిపాదన చేశాడు. ఈ ట్వీట్ పాకిస్థానీలను ఆకట్టుకుంది.

పాకిస్థానీలు దీనిని రీట్వీట్ చేస్తూ హోరెత్తించగా...భారతీయులు మాత్రం ఆసక్తికరంగా స్పందించారు. దయచేసి గాడిదలను గుర్రాలతో పోల్చవద్దని సూచిస్తున్నారు. పాక్ క్రికెటర్లు మరో రెండు తరాలైనా టీమిండియాకు సాటిరారు అని స్పష్టం చేశారు. అప్పుడు కశ్మీర్ కావాలన్నారు...ఇప్పుడు కోహ్లీ కావాలంటున్నారు...కానీ పాక్ కి ఎప్పటికీ 'కే' సొంతం కాదు అని మరో నెటిజన్ పేర్కొన్నాడు.





  • Loading...

More Telugu News