: నేను అంత కష్టపడలేను.. అందుకే దర్శకత్వం జోలికి మాత్రం వెళ్లను: దిల్ రాజు


తమ సంస్థకు, స్టైలిష్ స్టార్ బన్నీకి 'డీజే' హ్యాట్రిక్ మూవీ అవుతుందని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు అన్నారు. ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్ తో మరో సినిమాను నిర్మిస్తామని చెప్పారు. నిర్మాతగా తాను కచ్చితంగా యాభై సినిమాలు నిర్మిస్తానని... వంద చిత్రాలను నిర్మిస్తానో, లేదో చెప్పలేనని అన్నారు. తన జీవితంలో ఎప్పుడూ కూడా దర్శకత్వం జోలికి వెళ్లనని స్పష్టం చేశారు. ఒక సినిమాను నిర్మించే క్రమంలో దర్శకులు పడే శ్రమ తనకు తెలుసని, రాత్రింబవళ్లు వారు పడే కష్టం తనకు భయాన్ని కలిగిస్తుందని చెప్పారు. తాను అంత కష్టపడలేనని తెలిపారు.

  • Loading...

More Telugu News