: కిరణ్ కుమార్ రెడ్డీ, ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో: నాయిని
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై తెలంగాణ హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి సెటైర్లు వేశారు. తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను, ఏం చేసుకుంటావో చేసుకో అంటూ ఆనాడు నిండు సభలో అన్నారని... ఇప్పుడు మేము ప్రతి రంగానికి నిధులు కేటాయించుకుంటున్నామని... ఇప్పుడు మీరు ఏం చేసుకుంటారో చేసుకోండని నాయిని అన్నారు. నీళ్లు, ఉద్యోగాల కోసమే తాము తెలంగాణను సాధించుకున్నామని చెప్పారు. యువతకు ఉద్యోగాలను కల్పించే నేపథ్యంలో కార్మికశాఖ నిర్వహిస్తున్న జాబ్ మేళాలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని తెలిపారు. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కూడా జాబ్ మేళాలను నిర్వహిస్తామని చెప్పారు.