: ‘బాహుబలి’ విజయంతో ‘ఆకాశంపై కన్నేసిన’ ఇస్రో!
అత్యంత బరువైన జీఎస్ఎల్వీ-ఎంకే III రాకెట్‌ను ప్రయోగించి చారిత్రాత్మక విజయాన్ని అందుకున్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో అదే ఉత్సాహంతో మరో రాకెట్ ప్రయోగానికి సిద్ధమవుతోంది. ‘ఆకాశంలో కన్ను’ (ఐ ఇన్ ద స్కై)గా పిలుచుకునే కార్టోశాట్ సిరీస్ శాటిలైట్‌ను ఈ నెలఖారు నాటికి ప్రయోగించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
కార్టోశాట్-2 సిరీస్‌లో భాగంగా నాలుగోదైన ఈ ఉపగ్రహం బరువు 550 కేజీలు. పీఎస్ఎల్వీ-సీ38 రాకెట్ ద్వారా దీనిని ప్రయోగించనున్నారు. రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహమైన ఇది సీన్-స్పెసిఫిక్ స్పాట్ ఇమేజరీని అందించగలదు. ఇందులో ఉపయోగించిన స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ పాన్క్రోమాటిక్(పాన్) కెమెరాలు భూమి విద్యుదయస్కాంతాల వర్ణపటాల బ్లాక్ అండ్ వైట్ చిత్రాలను తీయగలవు.