: ఒంటరి పోరాటంతో ఆకట్టుకున్న మిల్లర్... పాక్ విజయ లక్ష్యం 220 పరుగులు!
ఛాంపియన్స్ లీగ్ లో భాగంగా ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో జరిగిన 7వ మ్యాచ్ లో పాక్ జట్టు రాణించగా, సఫారీలు ఆకట్టుకున్నారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీలకు పాక్ బౌలర్లు షాక్ ఇచ్చారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ బౌలర్లు ఆకట్టుకున్నారు. పాక్ బౌలర్ల లైన్ అండ్ లెంగ్త్ బంతులను సమర్థవంతంగా ఎదుర్కొని సహచరులు వెనుదిరుగుతున్నా పోరాట పటిమ చూపిన డేవిడ్ మిల్లర్ (75) ఆకట్టుకున్నాడు. అయితే తన సహజ స్వభావానికి విరుద్ధంగా నెమ్మదిగా ఆడడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. డికాక్ (33) ఆకట్టుకున్నా నిలదొక్కుకోలేకపోయాడు. ఆమ్లా (16), డివిలియర్స్ (0), డుమిని (8), పార్నెల్ (0) దారుణంగా విఫలమయ్యారు.
కాగా, డుప్లెసిస్ (26) తోపాటు చివర్లో క్రిస్ మోరిస్ (28), రబాడ (26) అండగా నిలవడంతో మిల్లర్ నాటౌట్ గా నిలిచి జట్టుకు ఉపయోగపడే పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో సౌతాఫ్రికా 7 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. పాక్ బౌలర్లలో హసన్ అలీ మూడు వికెట్లతో రాణించగా, జునైద్, ఇమాద్ చెరో రెండు వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. హఫీజ్ ఒక వికెట్ తీసి వారికి సహకరించాడు. బౌలింగ్, ఫీల్డింగ్ లో రాణించిన పాక్ జట్టు ఆత్మస్థైర్యం పుంజుకుంది. అయితే సఫారీలకు మంచి బౌలింగ్ లైనప్ ఉండగా, పాక్ కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఈ నేపథ్యంలో 220 పరుగుల విజయ లక్ష్యంతో పాక్ బ్యాటింగ్ ప్రారంభించనుండగా...ప్రస్తుతానికి మ్యాచ్ పాక్ వైపు మొగ్గు చూపుతోంది.