: సరదా కోసం కాల్చాడు... అదృష్టం కొద్దీ బతికిపోయాడు!


సరదాగా చేసే కొన్ని పనులు ఒక్కోసారి మరణాన్ని పరిచయం చేస్తుంటాయి. అలాంటి సందర్భమే ఒక యువకుడికి ఎదురైంది. ఫ్రిడ్జ్ లో పేలుడు పదార్థాలు ఉంచిన ఓ వ్యక్తి దానిని ఓ నిర్జన ప్రదేశంలో పెట్టి... తాను కొంత దూరంలోని చెట్టు కొమ్మల మధ్యకు వెళ్లి... అక్కడి నుంచి తుపాకీతో దానిని కాల్చాడు. ఆ బుల్లెట్ వెళ్లి ఫ్రిడ్జ్ ను తాకగానే అది పేలిపోయింది. అయితే ఫ్రిడ్జ్ తలుపు నేరుగా అతనున్న వైపుకి కన్నుమూసి తెరిచేంతలో దూసుకొచ్చింది. అయితే, అతను అదృష్టవశాత్తు చెట్టు కొమ్మల మధ్యనుండడంతో బతికిపోయాడు. లేకుంటే అది దూసుకొచ్చిన వేగానికి అతని ప్రాణాలు గాల్లో కలసిపోయివుండేవి. ఈ వీడియోను తీసిన వ్యక్తీ దానిని సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో వైరల్ అవుతోంది. మీరు కూడా ఆ వీడియోను చూడండి.


  • Loading...

More Telugu News