: సీబీఐ విచారణ జరిపితే పెదబాబు, చినబాబుల బండారం బయటపడుతుంది: జోగి రమేష్
విశాఖలో జరుగుతున్న భూకబ్జాలన్నీ ఇద్దరు బాబుల కనుసన్నల్లోనే జరుగుతున్నాయని వైసీపీ నేత జోగి రమేష్ ఆరోపించారు. ఈ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలని... సీబీఐ విచారణ జరిగితే పెదబాబు, చినబాబు, మంత్రుల పాత్ర బయటపడుతుందని చెప్పారు. సీబీఐ విచారణ జరిగితేనే అసలైన నిజాలు వెలుగులోకి వస్తాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు విచ్చలవిడిగా కబ్జాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రి అయ్యన్న పాత్రుడే స్వయంగా కబ్జాల గురించి ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. ఈ కబ్జాల వ్యవహారంలో చంద్రబాబు వ్యవహారం తేలాల్సి ఉందని చెప్పారు. దీపక్ రెడ్డి, గోల్డ్ స్టోన్ ప్రసాద్ లు చంద్రబాబుకు పెట్టుబడిదారులని అన్నారు.