: దుమ్ము దులిపేస్తోంది... అల్లు అర్జున్ సినిమా ట్రైలర్ కు భారీగా స్పందన!
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న కొత్త సినిమా ‘డీజే: దువ్వాడ జగన్నాథమ్’ సినిమా ట్రైలర్ యూ ట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తోంది. అల్లు అర్జున్ తనదైన శైలిలో వదిలిన డైలాగులతో పాటు డ్యాన్స్, ఫైట్స్, స్టైల్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ ట్రైలర్‌ను అల్లు అర్జున్ తన ఫేస్బుక్ ఖాతాలోనూ ఉంచారు. దీంతో అన్నింటిలో కలిపి కేవలం 46 గంటల్లోనే ఈ ట్రైలర్ 10 మిలియన్ క్లిక్‌లు సాధించింది. ఈ ట్రైలర్లో బన్నీ, పూజాహెగ్డే మధ్య రొమాన్స్ అదుర్స్ అనిపిస్తున్నాయి.
‘ఇంగువ లేకుండా పులిహోర చేస్తూ సభ్యసమాజానికి మనమేం మెసేజ్ ఇస్తున్నట్లు?’, ‘పైగా నాది మామూలు లవ్వా?’, ‘మనం చేసే పనిలో మంచి కనిపించాలి కానీ, మనిషి కనపడనక్కర్లేదు’, ‘ఈ రోజుల్లో మనం అనాల్సింది బుద్ధం శరణం గచ్ఛామి కాదు సర్.. యుద్ధం శరణం గచ్ఛామీ’, ‘సత్యనారాయణ పురం అగ్రహారం సాక్షిగా చెబుతున్నాను... నేను వాడిని చూసిన రోజే చంపకపోతే నా పేరు దువ్వాడ జగన్నాథమే కాదు’ అంటూ బన్నీ విసిరిన డైలాగులు అదరహో అనిపిస్తున్నాయి.
10 million views in 46 hours for #AlluArjun's #DJTrailer. That's how you stir up a storm online. #DJTrailerStorm #DuvvadaJagannadham pic.twitter.com/l9MtvDp29Z
— Haricharan Pudipeddi (@pudiharicharan) June 7, 2017