: చుక్కలు చూపించిన రైతులు.. పరుగులు తీసిన కలెక్టర్!
మధ్యప్రదేశ్లోని మాండసౌర్లో నిన్న రైతులు నిర్వహించిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తంగా మారడంతో వారిపై పోలీసులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ కాల్పుల్లో మృతి చెందిన రైతుల సంఖ్య ఐదుకి చేరింది. ఈ రోజు అక్కడి పరిస్థితిని పరిశీలించేందుకు సీనియర్ కలెక్టర్ కుమార్ సింగ్ వచ్చారు. అయితే, ఆయనకు స్థానికులు చుక్కలు చూపించారు. అక్కడ ఆందోళన తెలుపుతున్న 100 మందికి పైగా రైతులు ఒక్కసారిగా ఆయనపై దాడి చేసేందుకు యత్నించారు. కొంతమంది ఆయనను కొట్టారు కూడా. దీంతో కలెక్టరు పరుగులు తీశారు. పోలీసులు ఆయనను సురక్షితంగా అక్కడినుంచి తీసుకెళ్లారు. నిన్నటి ఘటనలో ఐదుగురు రైతులు మృతి చెందిన నేపథ్యంలో ఈ రోజు బంద్ పాటిస్తున్నారు.