: మోదీ, యోగీలపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర చిత్రాలు.. ఇద్దరి అరెస్ట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ల ఫొటోలను సోషల్ మీడియాలో అభ్యంతరకరంగా పోస్టు చేసిన నేరానికి బీఎస్పీ నేతతో పాటు అతడి స్నేహితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. అలీగఢ్ జిల్లా జలాలి పట్టణానికి చెందిన శంకర్ లాల్.. పిప్పల్ బీఎస్పీ జిల్లా ఛీప్‌గా పనిచేస్తున్నారు. ఈ నెల 4న ఆయన మోదీ, యోగిలపై అసభ్యకరంగా పోస్టులు చేశారు. ఆ ఫొటోలను జావేద్ అనే మరో నాయకుడు కూడా షేర్ చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన బీజేపీ ఎమ్మెల్యే రవీంద్రపాల్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.