: ఆ దేశానికి అనుకూలంగా వార్తలు రాస్తే 15 ఏళ్లు జైలు శిక్ష: 'ఖతార్'పై యూఏఈ తాజా నిర్ణయం


ఉగ్రవాదానికి ఊతమిస్తోందని మండిపడుతూ ఖతార్‌కి సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్‌తో పాటు మరికొన్ని దేశాలు రవాణా మార్గాలను మూసివేసిన విష‌యం తెలిసిందే. ఇక ఆ దేశంతో ఎటువంటి సంబంధాలు ఉండ‌బోవ‌ని తేల్చిచెప్పేశాయి. దీంతో పశ్చిమాసియాలో పెను దౌత్య సంక్షోభం త‌లెత్తింది. తాజాగా ఖతార్ విష‌యంలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్ మ‌రో నిర్ణ‌యం తీసుకుంది. ఆ దేశానికి అనుకూలంగా కానీ, సానుభూతిపరమైన వ్యాఖ్యలతో గానీ వార్తలు ప్రచురించడంపై నిషేధం విధించింది. ఈ ఆజ్ఞ‌ల‌ను ఉల్లంఘిస్తే 15 ఏళ్ల పైగా జైలు శిక్ష లేక లేదా 5 లక్షల దిర్హామ్స్‌ జరిమానా విధిస్తామ‌ని తెలిపింది. రాతపూర్వకంగా కానీ, సోషల్‌ మీడియా, విజువల్స్‌ రూపంలోనూ వార్తలు ప్రచురించడం, ప్రసారం చేయడం వంటివి చేయ‌కూడ‌ద‌ని పేర్కొంది. 

  • Loading...

More Telugu News