: హీరో ప్రభాస్ మైనపు విగ్రహం అద్భుతం: రమేష్ బాల
మేడమ్ టుస్సాడ్స్ లో ఏర్పాటు చేసిన హీరో ప్రభాస్ మైనపు విగ్రహం అద్భుతంగా ఉందని ఇండియన్ మూవీ ఇండస్ట్రీ ట్రాకర్, సోషల్ మీడియా స్ట్రాటజిస్ట్ రమేష్ బాల అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ప్రభాస్ మైనపు విగ్రహం ఎంతో రియల్ గా ఉందని, చాలా బాగుందని, ఇక్కడ మైనపు విగ్రహం ఏర్పాటు చేయడాన్ని ఒకరి ప్రజాదరణకు తిరుగులేని గుర్తింపుగా చెప్పవచ్చని తన ట్వీట్ లో సంతోషం వ్యక్తం చేశారు.