: ధోనీ దృష్టిలో అత్యంత క్లిష్టమైన బౌలర్ ఎవరంటే...!
ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం కష్టంగానే ఉంటుందని టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ చెప్పాడు. తనకున్నటువంటి తక్కువ టెక్నిక్ తో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కొవడంలో అప్పుడప్పుడు ఇబ్బందులు పడుతుంటానని తెలిపాడు. ఫాస్ట్ బౌలర్లలో ఎవరు గొప్ప? అని అడిగితే... పాక్ మాజీ బౌలర్ షోయబ్ అఖ్తర్ పేరే చెబుతానని అన్నాడు. షోయబ్ చాలా క్విక్ గా, చాలా ఫాస్ట్ గా ఉంటాడని పేర్కొన్నాడు. ఏ బంతిని ఎలా వేస్తాడో కూడా అర్థంకాదని చెప్పాడు.
ఒక బంతిని బౌన్సర్ గా వేస్తే, మరో బంతికి యార్కర్ ను సంధిస్తాడని, మరో బంతిని బీమర్ గా వేస్తాడని తెలిపాడు. షోయబ్ బంతులను అంచనా వేయడం చాల కష్టమని చెప్పాడు. షోయబ్ బౌలింగ్ లో ఆడటం చాలా ఆసక్తికరంగా ఉంటుందని తెలిపాడు. ఇంగ్లండ్ లో విరాట్ కోహ్లీ ఛారిటీ విందుకు హాజరైన సందర్భంలో... ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులుగా ధోనీ ఈ విధంగా స్పందించాడు.