: నాగాలాండ్ లో భద్రతా బలగాలపై తెగబడ్డ ఉగ్రవాదులు.. ఆర్మీ అధికారి, పౌరుడు మృతి
ఈ రోజు తెల్లవారుజామున భారత భద్రతా బలగాలపై ఉగ్రవాదులు తెగబడ్డ సంఘటనలో ఓ ఆర్మీ అధికారి వీరమరణం పొందాడు. నాగాలాండ్ లోని మౌ ప్రాంతంలో భద్రతా బలగాలపై ఉగ్రవాదులు జరిపిన దాడులను భారత జవాన్లు సమర్థంగా తిప్పికొట్టారు. ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ సంఘటనలో ఓ ఆర్మీ అధికారి సహా ఒక పౌరుడు ప్రాణాలు కోల్పోయాడు. మరో ముగ్గురు జవాన్లు గాయపడ్డారు. చికిత్స నిమిత్తం వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కాగా, భద్రతాబలగాలకు, ఉగ్రవాదులకు మధ్య ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.