: నేడు చెన్నైకి తిరిగి రానున్న రజనీకాంత్.. అభిమానులతో మళ్లీ ఫొటో సెషన్


‘కాలా’ చిత్రం షూటింగ్ నిమిత్తం తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ముంబయి వెళ్లిన విషయం తెలిసిందే. ఈ చిత్రం షూటింగ్ అక్కడ పూర్తవడంతో తిరిగి ఈ రోజు ఆయన చెన్నై చేరుకుంటారు. ఈ నెల 15, 16 తేదీల్లో అభిమానులతో మళ్లీ భేటీ కానున్నట్టు, అలాగే, తన అభిమానులతో మళ్లీ ఫొటో సెషన్ కూడా ప్రారంభించనున్నట్టు సమాచారం. స్థానిక కోడంబాక్కంలోని రాఘవేంద్ర కల్యాణ మండపంలోనే అభిమానులతో ఫొటో సెషన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. మొత్తం 18 జిల్లాలకు చెందిన అభిమానులతో రజనీ ఫొటో సెషన్ వుంటుంది. కాగా, గత నెలలో అభిమానులతో రజనీ ఫొటో సెషన్ ఐదు రోజుల పాటు జరిగింది.

  • Loading...

More Telugu News