: ఈ ఏడాది దేశంలో ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పట్టింది: ఐఎండీ


ఈ ఏడాది దేశంలో ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పట్టిందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఎల్ నినో ప్రభావం పూర్తిగా తగ్గిపోతుందని ఆస్ట్రేలియా వాతావరణ శాఖ అధికారులు కూడా చెబుతున్నారని తెలిపింది. గ్లోబల్ వార్మింగ్ కారణంగానే వాతావరణంలో మార్పులు చోటు చేసుకున్నాయని, గత ఏడాది కంటే ఈ ఏడాది వర్షపాతం ఎక్కువగానే ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది సగటు వర్షపాతం 98 శాతం వరకు సాధారణమని, మధ్య భారతంలో 100, దక్షిణ భారత్ లో 98 శాతం, పశ్చిమ, ఉత్తర భారత్ లో 96 శాతం వర్షపాతం ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. జులైలో 96 శాతం, ఆగస్టులో 99 శాతం వర్షపాతం ఉంటుందని అంచనా వేస్తున్నామని ఐఎండీ తెలిపింది.

  • Loading...

More Telugu News