: బీజేపీ ప్రభుత్వం ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలా వ్యవహరిస్తోంది: అరుణ్ శౌరీ సంచలన వ్యాఖ్యలు
బీజేపీ ప్రభుత్వం వ్యవహరించే తీరు ఓ ఈవెంట్ మేనేజ్ మెంట్ కంపెనీలా ఉందని బీజేపీ సీనియర్ నేత ఆర్థిక వేత్త, పాత్రికేయుడు అరుణ్ శౌరీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల పాలనలో మోదీ ప్రభుత్వం సాధించింది శూన్యమని, ప్రజాస్వామ్య పద్ధతులకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మేధావులు, నిపుణులతో ఎటువంటి సంప్రదింపులు జరపకుండా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటోందని, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తీవ్రమైన తప్పిదమని విమర్శించారు. జాతీయ భద్రతా విధానం, విదేశీ విధానం, చైనాతో సంబంధాలు వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దాని ఫలితం దారుణంగా ఉంటుందని అన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనలో మోదీ ప్రభుత్వం తీవ్ర వైఫల్యం చెందిందని అరుణ్ శౌరీ ఆరోపించారు.