: ఛాంపియన్స్ ట్రోఫీ: రాణించిన ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్... న్యూజిలాండ్ టార్గెట్ 311


ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈ రోజు ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌ల‌ మ‌ధ్య జ‌రుగుతున్న మ్యాచులో టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆలౌట్ అయ్యారు. 49.3 ఓవర్లలో పది వికెట్ల న‌ష్టానికి ఇంగ్లండ్ 310 ప‌రుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లో రాయ్ 13, హేల్స్ 56, రూట్ 64, మోర్గాన్ 13, స్టోక్స్ 48, అలీ 12, ర‌షీద్ 12, ప్లంకెట్ 15, వుడ్ 0, బాల్ 0 ప‌రుగులు చేశారు. ధాటిగా ఆడిన బ‌ట్ల‌ర్ 61 ప‌రుగుల‌తో అజేయంగా నిలిచాడు. న్యూజిలాండ్ బౌల‌ర్ల‌లో మిల్నీ, అండ‌ర్స‌న్‌లు మూడేసి వికెట్లు తీయగా, సౌతి రెండు వికెట్లు తీశాడు. బౌల్ట్‌, సాంట్న‌ర్ లకు చెరో వికెట్ ద‌క్కింది.           

  • Loading...

More Telugu News