: పెద్దషాపూర్ లో సైకో వీరంగం.. బ్లేడుతో బెదిరించి మహిళలపై అత్యాచారయత్నం.. దేహశుద్ధి చేసిన స్థానికులు!
రంగారెడ్డి జిల్లాలో ఓ సైకో వీరంగం సృష్టించాడు. రోడ్డుపై వెళుతున్న మహిళలను బ్లేడుతో బెదిరించి వారిపై అత్యాచారానికి విఫలయత్నం చేశాడు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు..మండలంలోని పెద్దషాపూర్ లో రోడ్డుపై నడచుకుంటూ వెళ్తున్న ఇద్దరు మహిళలను బ్లేడ్ తో బెదిరించి అత్యాచారం చేయబోయాడు. దీంతో, భయపడిపోయిన సదరు మహిళలు కేకలు వేయడంతో సైకోను పట్టుకుని చితకబాదిన స్థానికులు, అతన్ని శంషాబాద్ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, సైకో పేరు రసూల్ అని, అతనిని కర్నూలు జిల్లా వాసిగా గుర్తించామని చెప్పారు.