: రిజర్వ్ బ్యాంక్ పరువు గంగలో కలిసింది: ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి


రిజర్వ్ బ్యాంక్ పరువును పెద్ద నోట్ల రద్దు గంగలో కలిపేసిందని ఆర్బీఐ మాజీ గవర్నర్ వైవీ రెడ్డి అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత ఎంత నల్లధనం వెనక్కి వచ్చిందో చెప్పడం చాలా కష్టమని అన్నారు. నల్లధనంపై సామాన్య ప్రజలు విరక్తి చెందడం వల్లే నోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకించలేదని... లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని చెప్పారు. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకున్నా, నల్లధనాన్ని అరికట్టలేమని... అది మరో రూపంలో కొనసాగుతుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని బ్యాంకులు కోల్పోకూడదని సూచించారు. హైదరాబాదులో జరిగిన ఓ కార్యక్రమంలో వైవీ రెడ్డి మాట్లాడుతూ పైవ్యాఖ్యలు చేశారు.

  • Loading...

More Telugu News