: గుంటూరు, తిరుపతి సహా, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం.. ప్రజల ఇక్కట్లు
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్త్రాంధ్రలో అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఈ రోజు గుంటూరు, తిరుపతి సహా, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. తిరుమల, తిరుపతిల్లో భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. రహదారులు జలమయమయ్యాయి. ఈదురు గాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో భారీ వర్షం పడడంతో పలు చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అనంతపురం, గుంటూరు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు హెచ్చరించారు.