: ఆ చిన్నారి గుండె ఆగిపోయింది.. ఆమె కళ్లు మాత్రం ప్రపంచాన్ని చూడనున్నాయి!


భువనేశ్వర్ కు చెందిన రెండు నెలల చిన్నారి గుండె నిమిషానికి 15 సార్లు మాత్ర‌మే కొట్టుకుంటోంది. పుట్టుకతోనే త‌మ కూతురికి గుండె సంబంధిత వ్యాధి రావ‌డంతో ఆ శిశువు త‌ల్లిదండ్రులు త‌ల్ల‌డిల్లిపోయారు. చికిత్స నిమిత్తం ఆమెను కోల్ కతాకు తీసుకెళ్లారు. ఆప‌రేష‌న్ జ‌రిపిన అనంత‌రం ఆమె కాస్త‌ కోలుకున్న‌ప్ప‌టికీ, మ‌ళ్లీ రెండు రోజుల‌కే ఆ పాప‌ పరిస్థితి విష‌మించి గుండె కొట్టుకోవ‌డం ఆగిపోయింది. ఆ పాప మృతి చెందింద‌ని వైద్యులు నిర్ధారించారు.

పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ పాప త‌ల్లిదండ్రులు.. ఆమె రెండు కళ్లను దానం చేశారు. ఆమె చ‌నిపోయిన‌ప్ప‌టికీ ఆమె క‌ళ్లు లోకాన్ని చూస్తాయ‌ని త‌ల్లిదండ్రులు అన్నారు. ఆ క‌ళ్ల‌ను త్వ‌రలోనే ఇద్ద‌రికి అమ‌ర్చ‌నున్నారు. ఆ శిశువు ఇత‌ర అవయవాలను కూడా దానం చేసేందుకు ఆమె త‌ల్లిదండ్రులు ఒప్పుకున్నారు. కానీ, గుండె ఆగిపోవడంతో  రక్త సరఫరా పూర్తిగా ఆగిపోయి అవి పనికిరాకుండా పోయాయి.

  • Loading...

More Telugu News