: ఆఫ్ఘనిస్థాన్ లో భారతీయ దౌత్యవేత్త నివాసంపై రాకెట్ ప్రయోగించిన ఉగ్రవాదులు!


భారతీయ దౌత్యవేత్త లక్ష్యంగా ఆఫ్ఘనిస్థాన్ లో ఉగ్రదాడి జరిగింది. కాబూల్ లో భారతీయ దౌత్యవేత్త మన్ ప్రీత్ ఓహ్రా నివాసంలోని కాంపౌండ్ లోకి ఉగ్రవాదులు రాకెట్ ను ప్రయోగించారు. నివాస ప్రాంగణంలోని టెన్నిస్ కోర్టులో ఈ రాకెట్ పేలిపోయింది. అయితే, ఈ దాడిలో ఎవరికీ ఏమీ కాలేదు. కాబూల్ లో ఉన్న ఈ ఇండియా హౌస్ కు భారీ సెక్యూరిటీ ఉంటుంది. దీనికి చుట్టు పక్కల వివిధ దేశాలకు చెందిన ఎంబసీలు కూడా ఉన్నాయి. నాటోకు చెందిన హెడ్ క్వార్టర్ కూడా ఉంది. కాబూల్ లో 'శాంతి మరియు భద్రత సదస్సు' జరుగుతున్న సమయంలో ఉగ్రవాదులు ఈ దాడికి తెగబడ్డారు. ఈ సదస్సుకు 27 దేశాలకు చెందిన అత్యున్నత అధికారులతో పాటు అంతర్జాతీయ ఆర్గనైజేషన్లు కూడా హాజరయ్యాయి.

  • Loading...

More Telugu News