: నెల్లూరులో జనసేన పిలుపునకు భారీ స్పందన
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో జనసేన కార్యకర్తల ఎంపిక ఈ ఉదయం ప్రారంభం కాగా, పవన్ కల్యాణ్ అభిమానుల నుంచి భారీ స్పందన వచ్చింది. రెండు రోజుల పాటు జరగనున్న ఎంపిక ప్రక్రియలో వివిధ రకాల పోస్టులకు కార్యకర్తలను ఎంపిక చేయనుండగా, దాదాపు 2 వేల మందికి పైగా హాజరయ్యారు. వీరిలో కంటెంట్ రైటర్లు, ప్రసంగీకులను ఎంపిక చేయనున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పటికే పలు జిల్లాల్లో జనసేన కార్యకర్తల ఎంపిక పూర్తయింది. అనంతపురం జిల్లాతో ఈ ఎంపికలను మొదలు పెట్టిన పవన్ కల్యాణ్, అటు ఏపీలో, ఇటు తెలంగాణలో పార్టీని విస్తరిస్తూ జనసేనను ముందుకు తీసుకెళ్తున్నారు.