: శర్వానంద్ హీరోగా మరో ఫాంటసీ చిత్రాన్ని నిర్మించనున్న బాహుబలి నిర్మాతలు


'బాహుబలి' సినిమాతో అంతర్జాతీయ స్థాయి సినిమాను నిర్మించిన నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలు మరో భారీ ఫాంటసీ సినిమాకు సిద్ధమవుతున్నారు. శర్వానంద్ హీరోగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు కుమారుడు కేయస్ ప్రకాశ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. రూ. 40 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాలనే యోచనలో నిర్మాతలు ఉన్నారు. రూ. 20 కోట్ల మార్కెట్ ఉన్న శర్వానంద్ తో ఈ భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కించనుండటం సాహసమే. మరోవైపు గతంలో 'అనగనగా ఓ ధీరుడు' అనే ఫాంటసీ సినిమాను ప్రకాష్ తెరకెక్కించాడు. అయితే, ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. ఈ నేపథ్యంలో, బాహుబలి నిర్మాతలు సాహసం చేస్తున్నట్టుగానే చెప్పుకోవాలంటూ ఫిలింనగర్ లో గుసగుసలు మొదలయ్యాయి.  

  • Loading...

More Telugu News