: తెలంగాణకు కరెంట్ కట్... బకాయిలు చెల్లించాల్సిందేనని ఏపీ సర్కారు పట్టు!
తెలంగాణ రాష్ట్రానికి నేటి నుంచి కరెంట్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎస్ ట్రాన్స్ కో అధికారులకు లేఖ రాస్తూ, తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. బకాయిలు చెల్లిస్తేనే విద్యుత్ ను సరఫరా చేస్తామని ఏపీ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్ స్పష్టం చేసింది. తెలంగాణ నుంచి రూ, 4,449 కోట్ల బకాయి రావాల్సి వుందని గుర్తు చేసిన ఏపీ ప్రభుత్వం వాటిని చెల్లించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించింది. బకాయిలు చెల్లించేంత వరకూ విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్టు వెల్లడించింది. ఈ లేఖపై తెలంగాణ ప్రభుత్వం స్పందించాల్సి వుంది.