: ఆవరించిన మేఘాలు... తడిసి ముద్దవనున్న తెలుగు రాష్ట్రాలు!


నేటి నుంచి మూడు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. రుతుపవనాల ప్రభావం ఇంకా మొదలు కానప్పటికీ, తెలంగాణ, ఏపీలతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, కర్ణాటకలోని పలు ప్రాంతాలపై ఆవరించిన క్యుములో నింబస్ మేఘాల ప్రభావంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవచ్చని వాతావరణ శాఖ అంచనా వేసింది.

 ఇప్పటికే దక్షిణాది మేఘావృతం కాగా, గత రాత్రి సైతం పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. అరేబియాలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనంతో నైరుతి రుతుపవనాల కదలిక మందగించిందని, అల్ప పీడన ద్రోణి ప్రభావం జార్ఖండ్ నుంచి ఉత్తర కోస్తా వరకూ ప్రభావం చూపనుందని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోని రాయలసీమ ప్రాంతానికి నైరుతి రుతుపవనాలు నేడు ప్రవేశించే అవకాశాలు ఉన్నాయని, ఈ నెల 9వ తేదీ నాటికి తెలంగాణ వ్యాప్తంగానూ విస్తరిస్తాయని అంచనా వేశారు. రుతుపవనాలకు ముందే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపారు.

  • Loading...

More Telugu News